Robbery attempt failed in laksar station uttarakhand: చాలా మంది దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ఎక్కువగా ట్రైన్  జర్నీలు చేస్తుంటారు. ట్రైన్ లో ఎంచక్కా కూర్చుని జర్నీని చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. బస్సులు, పర్సనల్ వాహానాల కంటే కూడా  ట్రైన్ లలో ఎక్కువ మంది జర్నీలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా..  కొన్నిసార్లు రైళ్లలో రాత్రిపూట జర్నీలు చేసేటప్పుడు అనుకోని  ఘటనలు జరుగుతుంటాయి. రాత్రిళ్లు కొందరు దొంగలు చైన్ లు లాగేసీ అడవి మధ్య భాగంలో బంగారు  చైన్ లు, డబ్బుల వాలెట్లను దొచుకుంటారు. గన్ లతో బెదిరిస్తూ మూకుమ్మడిగా ట్రైన్ లలో ఎక్కుతుంటారు. మరికొందరు ఎవరి దగ్గర కాస్లీ వస్తువులు, మెడలో చైన్ లు, గొలుసులు ఉన్నాయో చూసుకుంటారు. రాత్రికాగానే.. మెల్లగా చోరీలకు పాల్పడుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


ఇక ఈ మధ్య కాలంలో అడవుల్లో చైన్ లు లాగేసి చోరీలు చేయడం కామన్‌గ మారిపోయింది. అందుకే రాత్రిళ్లు జర్నీలు చేయడానికి చాలా మంది ప్రయాణికులు భయపడుతుంటారు. కొన్నిసార్లు దొంగల దాడిలో ప్రయాణికులు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లోని లక్సర్ లో ఇటీవల రైలు చోరీ ఘటన వార్తలలో నిలిచింది. కానీ ఇక్కడ మాత్రం చోరీలకు ట్రై చేసిన ప్రయాణికులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


ఉత్తరాఖండ్ లోని లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  మొరాదాబాద్-సహారన్‌‌పుర్ రైల్వే డివిజన్ పరిధిలోని లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు సిగ్నల్ ఉంది. కొందరు దుండగులు సిగ్నల్ కు బురదను పూశారు. దీంతో రాత్రిపూట సిగ్నల్ లైట్లు కన్పించలేదు. దీంతో ఆ మార్గంలో వస్తున్న పాటలీపుత్ర ఎక్స్‌‌ప్రెస్, గోరఖ్‌ పుర్- చండీగఢ్ ప్రత్యేక రైళ్లు నిలిచిపోయాయి. తమ ప్లాన్ ప్రకారం దుండగులు వెంటనే రెండు రైళ్లలో దూరిపోయారు. ప్రయాణికును బెదిరిస్తు డబ్బులు, బంగారం ఇచ్చేయాలంటూ బెదిరింపులకు గురిచేశారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కానీ వెంటనే తెరుకుని మూకుమ్మడిగా దొంగలపై రివర్స్ దాడికి దిగారు.


Read more; Viral video: బస్సు కిటికీలో తల ఇరుక్కుపోయి విలవిల్లాడిన మహిళ... వైరల్ గా మారిన వీడియో..


ప్రయాణికుల దాడికి, దొంగలు తోకలు ముడిచి రైళ్ల నుంచి దిగిపోయారు. ఇక తమ ప్లాన్ ను బెడిసి కొట్టిందని దొంగల కోపంతో.. రైళ్ల మీద రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో లోకో పైలేట్ వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. లక్సర్ ఆర్పీఎఫ్ ఇంఛార్జ్ ఎస్ఐ రవి శివాచ్, జీర్పీ స్టేషన్ హెడ్ సంజయ్ శర్మ, ఎస్పీ సరితా దోవల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter