ముంబై ఉగ్రదాడిని గుర్తు చేసింది : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. క్యాంపస్ లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. క్యాంపస్ లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ యూనివర్శిటీలో ఇలాంటి దాడులు జరగడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని మహారాష్ట్ర సీఎం అభిప్రాయపడ్డారు. అంతే కాదు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులు పిరికి వారని చెప్పారు. పిరికి వారు కాబట్టే .. వారు తమ ముఖాలకు ముసుగు వేసుకున్నారని తెలిపారు.
టీవీ న్యూస్ లో చూస్తుంటే .. జేఎన్ యూ దాడి దృశ్యాలు భయానకంగా కనిపించాయని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ముంబైలో ఉగ్రవాద దాడి జరిగిన 26/11ను గుర్తు చేశాయన్నారు. ఐతే మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు రావన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.