Aadhaar Card Rules: దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డును జారీ చేసేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏదైనా సరే ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఎక్కౌంట్, పాస్‌పోర్ట్ , సిమ్‌కార్డు ఇలా ప్రతి దానికీ ఆధార్ అవసరమౌతోంది. అందుకే ఆదార్‌లో అవసరమైన మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డులో మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలు మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. అయితే ఈ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి తన ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసుకుందాం. సాధారణంగా పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు తప్పుగా ప్రింట్ అవుతుంటాయి. ఫోన్ నెంబర్, అడ్రస్ మారుతుంటుంది. అందుకే ఆప్‌డేట్ అనేది అవసరం. యూఐడీఏఐ ప్రకారం పేరులో మార్పులకు 2 సార్లు అవకాశముంటుంది. అదే జెండర్, పుట్టిన తేదీ మార్పుకు ఒక్కసారే అవకాశముంటుంది. అదే ఫోన్ నెంబర్, అడ్రస్ ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అడ్రస్ ఆన్‌లైన్ విధానంలో మార్చుకోవాలంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలీఫోన్ బిల్లు లేదా రెంటల్ అగ్రిమెంట్ సమర్పించాల్సి వస్తుంది. 


ముఖ్యంగా మహిళలకు పెళ్లి తరువాత ఇంటి పేరు మారుతుంది. ఆధార్‌లో కూడా మార్చుకోవాలంటే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. దీనికి 50 రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. పుట్టిన తేదీ మార్చుకోవాలన్నా ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. అవసరమైన డాక్యుమెంట్స్ పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్ వంటివి సమర్పించాలి. ఆ తరువాత మీ బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. అంతే దీనికి కూడా 50 రూపాయలు ఫీజు చెల్లించాలి.


ఆన్‌లైన్‌లో అడ్రస్ మార్చుకోవాలంటే ముందుగా myaadhaar.uidai.gov.in/ ఓపెన్చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఇప్పుడు ఆధార్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో అడ్రస్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు మార్చాల్సిన కొత్త అడ్రస్ ఎంటర్ చేయాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.  50 రూపాయలు ఫీజు చెల్లించాలి. కేవలం 1-2 రెండ్రోజుల్లో అడ్రస్ అప్‌డేట్ అవుతుంది. 


Also read: IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.