ఆధార్ కార్డు కోసం ప్రజల నుండి సేకరించిన వ్యక్తిగత సమాచారం అమ్ముడవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు వస్తున్న నేపథ్యంలో విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఏఐ) ఘాటుగా స్పందించింది. ఆధార్ సమాచారాన్ని రూ.500 రూపాయలతో కొనుగోలు చేసినట్లు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక విలేఖరి రాసిన కథనం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే...!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కూడా చదవండి: రూ.500లకే.. 1 బిలియన్ ఆధార్ నెంబర్లు


తాజాగా యూఐడిఏఐ ఆ కథనాన్ని ప్రచురించిన విలేకరి రచనా ఖైరాపై, పత్రికపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆధార్ పై ఇలాంటి వార్తలు ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. కాగా పోలీసులు ఆ పాత్రికేయుడితో పాటు అతను సంప్రదించిన మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 419, 420, 468, 471, ఐటీ చట్టం సెక్షన్ 66, ఆధార్ చట్టం సెక్షన్లు 36,37 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఈ అరెస్ట్‌ను భారత పత్రికా సంపాదకుల సమాఖ్య (ఎడిటర్స్ గిల్డ్) తీవ్రంగా ఖండించింది.