Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 75 లక్షల ఎల్పీజీ కొత్త కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పథకంలో భాగంగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ. 1,650 కోట్లు కేటాయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా ఇవ్వబోతున్న 75 లక్షల ఉచిత LPG కనెక్షన్లతో పాటు దేశవ్యాప్తంగా 10.35 కోట్ల మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధి పొందుతున్నట్లు అయ్యింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాల మహిళలకు LPG కనెక్షన్‌లను అందించడానికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు. మే 2016లో ఈ పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.


Also Read: Pawan Kalyan: రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్.. నారా లోకేష్‌కు రజనీకాంత్ ఫోన్  


జీ20 సమ్మిట్ పై తీర్మానం..
ఉజ్వల యోజన తీర్మానంతో పాటు జీ20 సమ్మిట్‌ను విజయవంతం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్.. ఈ తీర్మానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారని, దానిని ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు.


పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అసోసియేషన్ ప్రారంభించడంతో పాటు ఆఫ్రికన్ యూనియన్‌ను ఏకాభిప్రాయంతో జీ20 ఆమోదించింది. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ప్రధాని మోదీ ప్రతిపాదించిన నిర్ణయాలను జీ20 సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడం యావత్ దేశానికి గర్వకారణమని క్యాబినెట్ పేర్కొందని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.


Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook