Heeraben Modi Health: హీరాబెన్ మోడీ హెల్త్ బులిటెన్ విడుదల.. ఆస్పత్రికి చేరుకున్న ప్రధాని మోడీ
Un Mehta Hospital Releases Heeraben Modi Health Bulletin: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అనారోగ్యంతో భాధ పడుతుండగా ఆమెను యూఎన్ మెహతా హాస్పిటల్ కు తరలించారు, ఆమె హెల్త్ కు సంబంధించిన బులెటిన్ ను హాస్పిటల్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు
Un Mehta Hospital Releases Heeraben Modi Health Bulletin: గత రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో రెండు పెద్ద ఘటనలు చోటు చేసుకున్నాయి, ముందుగా ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోదీ కర్ణాటకలోని మైసూర్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరోపక్క అదే సమయంలో బుధవారం ఆయన తల్లి హీరాబెన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమెను చేర్చారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యూఎన్ మెహతా ఆస్పత్రి యాజమాన్యం తాజా బులెటిన్ ను విడుదల చేసింది. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత వైద్యుల నుంచి తల్లి ఆరోగ్యంపై తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఇక నిజానికి హీరాబెన్ మోడీ కరోనా సమయంలో వ్యాక్సిన్ తీసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.కరోనా కాలంలో ప్రజలు దానిని తీసుకోవడానికి భయపడే సమయంలో హీరాబెన్ మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారు, హీరాబెన్ తీసుకున్న తరువాత సమాజంలోని చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు.
ఇక మరోపక్క మంగళవారం నాడు జరిగిన కారు ప్రమాదంలో ప్రధాని మోదీ తమ్ముడు గాయ పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ కారు ప్రమాదంలో గాయపడ్డారు. నివేదికల ప్రకారం, ఆయన తన కొడుకు, కోడలు సహా మనవడితో కలిసి బందీపూర్ వెళుతుండగా, కర్ణాటకలోని మైసూరు సమీపంలో వారి మెర్సిడెస్ బెంజ్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రహ్లాద్ మోడీ తన కుటుంబంతో పాటు చికిత్స కోసం JSS ఆసుపత్రిలో చేరారు, అయితే, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సాయంత్రం లేదా గురువారం ఉదయం డిశ్చార్జి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Venuswamy on Prabhas: 2023 నుంచి దారుణంగా ప్రభాస్ పరిస్థితి.. వేణు స్వామి సంచలన కామెంట్లు!
Also Read: Sai Dharam Tej: పవన్ ను ఇమిటేట్ చేసిన తేజ్.. బాలయ్య ముందే తొడకొట్టి మరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook