గ్రామీణాభివృద్ధి ప్లానింగ్ ఇలా వుంది : అరుణ్ జైట్లీ
గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం వేస్తోన్న స్కెచ్ ఏంటి ?
గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన కేంద్ర బడ్జెట్ గురించి శనివారం జీ మీడియా గ్రూప్‌కి చెందిన జీ బిజినెస్ ఛానెల్‌తో తన అభిప్రాయాలని పంచుకున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. జీ బిజినెస్ ఛానెల్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో గ్రామీణాభివృద్ధి ప్రణాళికలపై క్లుప్తంగా పలు వివరాలు వెల్లడించారు.
'ఒక గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించినట్టయితే, ఆ ఊరిలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాలి. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఆ గ్రామంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్డి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వారికి ఉపాధి కల్పించాలి. అటువంటప్పుడు ఆ గ్రామంలోని పౌరుల ఆదాయం, కొనుగోలు శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. వారి బతుకు చిత్రం బాగుపడుతుంది. ఆ గ్రామస్తుల జీవన శైలిలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది' అని అన్నారు అరుణ్ జైట్లీ.