Union Budget 2022: బడ్జెట్‌కు ముందు హల్వా వేడుకను రద్దు చేసిన మోదీ సర్కారు.. కారణమదే!

Union Budget 2022 Halwa Ceremony: ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన తర్వాత హల్వా వేడుకను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక శాఖ సిబ్బందికి హల్వా పంచలేదని అధికారులు తెలిపారు. దాని స్థానంలో బడ్జెట్ రూపొందించిన సిబ్బందికి స్వీట్స్ పంచిపెట్టినట్లు స్పష్టం చేశారు.
Union Budget 2022 Halwa Ceremony: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే మందు రోజు హల్వా వేడుక జరగడం సంప్రదాయంగా వస్తోంది. బడ్జెట్ ప్రతులు ప్రచురించే సిబ్బందిని కొన్ని రోజుల పాటు 'లాక్-ఇన్' చేసి.. అది పూర్తైన తర్వాత వారికి కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా అందజేయడం జరుగుతుంది. అయితే ఈసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో హల్వా వేడుకను కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. హల్వా స్థానంలో సిబ్బందికి స్వీట్స్ పంచి పెట్టారు.
హల్వా వేడుక ఎందుకు జరుపుకొంటారు?
దేశ బడ్జెట్ కు సంబంధించిన అంశాలను చాలా రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్ కు సంబంధించిన రూపుకల్పన ప్రారంభమైన రోజు నుంచి.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ బ్లాక్ లోకి విలేకర్లు సహా ఇతరులను అనుమతించరు. బడ్జెట్ ప్రతుల ముద్రణలో భాగంగా ఆర్థిక శాఖకు చెందిన కొంతమంది కీలక సిబ్బంది.. అక్కడే కొన్ని రోజులు శ్రమించి బడ్జెట్ ను రూపుకల్పన చేస్తారు.
ఆ ప్రక్రియ పూర్తైన వెంటనే సిబ్బంది కోసం హల్వాను ఆర్థిక శాఖ మంత్రి సమక్షంలో వారికి పంచుతారు. చాలా ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిబ్బందికి తొలిసారి స్వీట్స్ పంచారు.
పేపర్ లెస్ బడ్జెట్
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బడ్జెట్ కాపీలను పరిమిత సంఖ్యలో ముద్రించారు.
రూపకల్పన పూర్తయ్యే వరకు అక్కడే..
కేంద్ర బడ్జెట్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆర్థిక శాఖకు సంబంధించిన సిబ్బంది లాక్ ఇన్ లోని వెళ్లిపోతారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేంత వరకు ఆ సిబ్బంది నార్త్ బ్లాక్ లోనే ఉంటారు. అయితే బడ్జెట్ రూపుకల్పన చేసే క్రమంలో ఆ సిబ్బంది కనీసం వారి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కూడా అనుమతి లేదు. అత్యవసరమైతే అధికారుల సమక్షంలో ఫోన్ మాట్లాడేందుకు అనుమతి ఉంది.
Also Read: Budget 2022: ఐటీ రిటర్న్‌ల దాఖలులో వెసులుబాటు.. రెండేళ్లలో అప్‌డేట్ చేసుకోవచ్చు..
Also Read: Budget 2022 Updates: క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం, త్వరలో సొంతంగా డిజిటల్ రూపీ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook