Union Budget 2024:  2024 లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లు ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో పలు ప్రజా కర్షక పథకాలకు పెద్ద పీఠ వేసింది. అంతేకాదు బిహార్, ఆంధ్ర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు పూర్వోదయ పథకం కింద ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు నిరుద్యోగ యువతకు అందించే ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంతేకాదు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అభివృద్ది కోసం ఇండియా పోప్ట్ పేమెంట్ బ్యాంక్స్ ను స్థాపించిబోతున్నట్టు ప్రకటించారు. 12 పారిశ్రామిక కారిడార్ లు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ పురర్విభజన చట్టానికి  కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు ఏపీలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్స్ మంజూరు చూస్తేనే.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు బడ్జెట్ లో పేర్కొన్నారు.


మరోవైపు బడ్జెట్ తో కొత్త పన్ను విధానంలో మార్పులు..



సున్నా  నుంచి రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని బడ్జెట్ లో పేర్కొన్నారు.
రూ. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు రూ. 15 శాతం పన్ను
రూ. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు రూ. 20 శాతం పన్ను
రూ. 15 లక్షల నుంచి ఆపై ఎంత ఉన్నా..30 శాతం పన్నుగా నిర్ణయించారు.


మరోవైపు స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు పెంచారు. మొత్తంగా ఈ బడ్జెట్ సామాన్యులకు కాస్త ఊరట నిచ్చేలా ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter