Cabinet meeting to table Farm Laws' withdrawal: దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా (PM Modi on Farm laws) ప్రకటించడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను ఉపసంహరించుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను (Farm laws repealed) పూర్తి చేయనున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.


తొలుత కేబినెట్ ముందుకు..


పార్లమెంట్​లో నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను మొదలు పెట్టేందుకు.. కేంద్ర కేబినెట్​లోదీనిపై చర్చ జరగనుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్​ భేటీ (Union cabinet meeting) కానుంది. ఇందులో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. సాగు చట్టాల రద్దు తీర్మాన్ని కేబినెట్ ముందు ఉంచే అవకాశముంది.


Also read: ఝార్ఖండ్ లో రైల్వే ట్రాక్ ను పేల్చేసిన మావోయిస్టులు.. నిలిచిన రైలు రాకపోకలు


కొత్త చట్టాల రద్దు ఇలా..


గత ఏడాది ఇదే సమయంలో నూతన సాగు చట్టాలను ఆమెదించింది కేంద్రం. రైతులకు మేలు చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు. దిల్లీ సరిహద్దుల్లో పలు మార్లు ఈ నిరసనల్లో హింస కూడా చెలరేగింది.


ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇటీవల గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఉద్యమం వీడి ఇళ్లకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.


అయితే సాగు చట్టాలు సన్నకారు రైతులను ఆదుకునేందుకే తెచ్చామని.. కానీ అందరికీ దీనిని అర్థమయ్యేలా వివరించలేకపోయామని మోదీ పేర్కొన్నారు.


మోదీ సర్కార్​ సాగు చట్టాలపై వెనక్కి తగ్గడాన్ని విపక్షాలు.. ప్రముఖులు అందరూ స్వాగతించారు.


Also read: ‘ఇమ్రాన్ ఖాన్ నా పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గంభీర్ ఫైర్


Also read: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 10,488 కరోనా కేసులు, 313 మరణాలు


సాగు చట్టాల రద్దు ప్రక్రియ ఇలా..


సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ.. కూడా చట్టాలు ఆమలులోకి వచ్చిన విధంగానే ఉంటుంది. అంటే.. ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్​లో అందుకు సంబంధఇంచి బిల్లు ప్రవేశ పెట్టాలి. దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టాన్ని రద్దు చేయాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది.


Also read: నేడు రాజస్థాన్ కేబినెట్ విస్తరణ- కొత్తగా 15 మందికి చోటు!


Also read: షార్ట్స్ ధరించినందుకు బ్యాంకు లోపలికి నో ఎంట్రీ... కోల్‌కతా యువకుడికి చేదు అనుభవం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook