పెగసస్ ఎన్ఎస్ఓ గ్రూప్‌తో ఎలాంటి లావాదేవీల్లేవు
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై భారత రక్షణ శాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీ సంస్థతో ఎలాంటి లావాదేవీలు లేవని తేల్చిచెప్పింది.
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై భారత రక్షణ శాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీ సంస్థతో ఎలాంటి లావాదేవీలు లేవని తేల్చిచెప్పింది.
పెగసస్ స్పైవేర్(Pegasus Spyware) ప్రకంపనలు చల్లారడం లేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లపై నిఘా పెట్టిందని..ఇందులో భాగంగా ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెగసస్ వ్యవహారంపై చర్చ జరగాలని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ అంశంపై భారత రక్షణ శాఖ(Union Defence Ministry)మరోసారి వైఖరి స్పష్టం చేసింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్(NSO Group)టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదని తెలిపింది. అటు ఎన్ఎస్ఓ గ్రూప్ కూడా ఇండియాలో విపక్షాల ఆరోపణల్ని కొట్టివేసింది. భారత పౌరులపై ప్రభుత్వం నిఘా పెట్టిందంటూ మీడియాలో వస్తున్న వార్తల్ని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ఖండించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని తెరపై తీసుకొచ్చారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. దేశంలో ఎన్నో నియంత్రణ వ్యవస్థలున్నాయని..అనధికార వ్యక్తులు చట్ట విరుద్ధంగా పౌరులపై నిఘా పెట్టడం సాధ్యం కాదన్నారు.
Also read: ఏపీలో ఇక నుంచి పెళ్లిళ్లలో 150 మంది వరకూ అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook