Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా..కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి..!
Jamili Elections: జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Jamili Elections: జమిలి ఎన్నికలకు మోదీ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతున్నట్లు తెలుస్తోంది. ఈఅంశాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది.
దీనిపై ఎన్డీఏ కూటమితో చర్చించామని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసిందని..వాటిని లాకమిషన్ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. త్వరలో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ నుంచి క్లారిటీ రానుంది. వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని..2014 నుంచి ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని పార్లమెంట్‌లో వివరించింది.
ఎన్నికల నిర్వహణ ఆర్థిక భారంతో కూడుకుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని..దీని వల్ల ప్రజా ధనం ఆదా అవుతుందని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోంది. 2016లో ప్రధాని మోదీ తొలిసారి జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. అప్పటి నుంచి వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనే అంశం తెరపైకి వస్తూనే ఉంది.
ఇప్పటివరకు 1952 నుంచి 1967 మధ్యలో నాలుగు సార్లు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. దీంతో అప్పటికప్పుడు ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈక్రమంలో జమిలి ఎన్నికల అంశం కనుమరుగు అయ్యింది. అప్పటి నుంచి ఐదేళ్లు పూర్తి అయిన ప్రతి రాష్ట్రంలో ఎన్నిలను నిర్వహిస్తున్నారు.
Also read:CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!
Also read:Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్..ఐదురోజులపాటు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook