Bharat vs India: దేశంలో హఠాత్తుగా పేరు మార్పు చర్చ ప్రారంభమైంది. జీ20 సదస్సు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముద్రించిన అధికారిక విందు ఆహ్వానపత్రంపై ఇండియా బదులు భారత్ అనుండటంతో దేశవ్యాప్తంగా ఈ చర్చ ప్రారంభమైంది. అసలిందులో వాస్తవమేంటి, ప్రధాని మోదీ వైఖరేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘనంగా ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అధికారిక విందు ఆహ్వాన పత్రం ముద్రించింది. రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే సాంప్రదాయక అధికారిక విందు అది. ఈ ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. అంతే ఇండియా పేరు భారత్‌గా మార్చుతున్నారని, ఈ నెలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. దాంతో సహజంగానే విపక్షాల అభ్యంతరం ప్రారంభమైంది. ఇప్పుడు దేశం పేరు మార్చాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే భారత్ పేరు బాగుందని, మంచి నిర్ణయమని సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం ఈ వార్తల్ని ఖండించారు. పేరు మార్పు వార్తలన్నీ పుకార్లుగా కొట్టిపారేశారు. అదే సమయంలో భారత్ అనే పేరు పట్ల ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరంతో భారత్ పట్ల వారి వైఖరి కన్పిస్తోందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.


అయితే ఇవాళ ప్రారంభమైన జి20 సదస్సులో సైతం ప్రదాని నరేంద్ర మోదీ కూర్చున్న ప్రదేశంలో నేమ్‌ప్లేట్‌పై ఇండియా బదులు భారత్ అని రాసుంది. అంటే పేరు మార్పుపై ప్రధాని మోదీ సైతం పరోక్షంగా సంకేతాలిచ్చినట్టేనా అనే వాదన విన్పిస్తోంది.పేరు మార్పుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఈ నేమ్‌ప్లేట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.


Also read: G20 Summit Day 1: ఘనంగా ప్రారంభమైన జీ20 సదస్సు, మోదీ స్వాగతోపన్యాసం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook