PFI Ban: పీఎఫ్ఐకు ISIS లింకులు! దేశ భద్రతకు ముప్పు... ఐదేళ్ల పాటు నిషేదం
PFI Ban: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 14 రాష్ట్రాల్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు... ఇప్పటికే వంది మందికి పైగా అరెస్ట్ చేశారు. తాజాగా పీఎఫ్ఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
PFI Ban: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 14 రాష్ట్రాల్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు... ఇప్పటికే వంది మందికి పైగా అరెస్ట్ చేశారు. తాజాగా పీఎఫ్ఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐతో దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధ సంస్థలుగా ప్రకటించింది. Unlawful Activities Prevention Act(UAPA ) కింద ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదలైంది. పీఎఫ్ఐతో పాటు CFI, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలపైనా ఈ నిషేదం వర్తించనుంది. [[{"fid":"246650","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
సోషియో ఎకనామిక్, విద్య, రాజకీయ సంస్థగా పనిచేస్తున్నట్లు చెబుతున్న పీఎఫ్ఐ సంస్థ అంతర్గతంగా సీక్రెట్ ఎజండాను పాటిస్తోందని తన గెజిటిలో కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రాజ్యాంగ అధికారాన్ని, రాజ్యాంగబద్ధమైన దేశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపింది. పీఎఫ్ తో పాటు దాని అనుబంధ సంస్థలు, అందులోని సభ్యులు చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వివరించింది. పీఎఫ్ఐ విధానాలు దేశ భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. దేశంలో తీవ్రవాదాన్ని రోత్సహిస్తోందని తన గెజిట్ లో కేంద్రం తెలిపింది. ఐఎస్ఐఎస్ లాంటి ప్రపంచ ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐకు లింకులు ఉన్నాయని గుర్తించామని వెల్లడించింది. ఈ కారణాల వల్ల పీఎఫ్ఐను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించినట్లు స్పష్టం చేసింది.
పీఎఫ్ఐ సంస్థ 2006లో కేరళలో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. తర్వాత దేశమంతటా విస్తరించింది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.అయితే సా ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు పీఎఫ్ఐపై ఉన్నాయి. పీఎఫ్ఐ సంఘ విద్రోహ చర్యలకు సంబంధించి సెప్టెంబరు 22న ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేసి దాదాపు వంద మందికి పైగా అరెస్ట్ చేసింది.
Also Read : Men in Sarees Garba Dance: అక్కడ మగాళ్లు కూడా చీరలు ధరించి, గర్బా డ్యాన్స్ చేయాల్సిందే.. ఎక్కడో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి