Nitin Gadkari Threat Call: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నుంచి నితిన్ గడ్కరీకి రెండుసార్లు చంపేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసుల ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడ్కరీని హత్య చేస్తామని బెదిరించడంతో పాటు దావూద్ ఇబ్రహీం పేరును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని హుబ్లీ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా గడ్కరీ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.


నితిన్ గడ్కరీకి బెదిరింపు రావడంతో కలకలం రేపుతోంది. నితిన్ గడ్కరీకి ఫోన్‌లో చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. సమాచారం తెలియగానే తమ బృందం నాగ్‌పూర్‌లోని మంత్రి కార్యాలయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిందన్నారు. దోషులు ఎవరైనా వీలైనంత త్వరగా పట్టుకుని.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నితిన్ గడ్కరీకి ట్విట్టర్‌లో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా మంత్రికి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. సోషల్ మీడియా ద్వారా తాను ఎలా సంపాదించడం ప్రారంభించారో స్వయంగా ఆయన యూట్యూబ్‌లో చెప్పారు. 


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి