Union Minister Nitin Gadkari reveals his income from youtube : ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. కుకింగ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ లక్షల్లో ఆదాయం పొందేవారు చాలా మందే ఉన్నారు. తమలో ఉండే టాలెంట్‌ను నిరూపించుకోవడానికి యూత్‌ అంతా యూట్యూబ్‌నే ఎంచుకుంటోంది. అలా అని అందరికీ పెద్ద మొత్తంలో రెవెన్యూ రాకపోవచ్చు. ఇక కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా యూట్యూబ్‌ (youtube) ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అసలు నితిన్‌ గడ్కరీ  యూట్యూబ్‌ ద్వారా నెలకు వచ్చే సంపాదన ఎంత అది ఎలా వస్తోందో ఒకసారి చూద్దామా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తాజాగా తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హరియాణాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల్ని సమీక్షించేందుకు వెళ్లిన గడ్కరీ..  అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చెప్పారు.


Also Read : One time settlement offer: ఇంటి స్థలాలను తనఖా పెట్టి రుణం తీసుకున్న వారికి ఏపీ ప్రభ్వుతం తీపి కబురు,  వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌‌


కరోనా టైంలో ఇంటికే పరిమితమైన తాను రెండేరెండు పనులు చేసేవారట.  ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్స్‌ (speeches in video conference) ద్వారా ఉపన్యాసాలు ఇచ్చేవారట.  అలాగే ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నానని వెల్లడించారు నితిన్ గడ్కరీ. వాటన్నింటినీ యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశానని తెలిపారు. ఇక వాటికి వ్యూస్‌ ఎక్కువ రావడంతో యూట్యూబ్‌ నెలకు తనకు నాలుగు లక్షలు చెల్లిస్తోందంటూ  అసలు విషయాన్ని వెల్లడించారు గడ్కరీ (Gadkari).


Also Read : T20 World Cup: సెలెక్ట్ కానుందుకు బాధగా ఉంది...అయితేనేం..!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook