No Tollgate: నిన్న ఫాస్టాగ్..రేపు జీపీఎస్..జాతీయ రహదారులపై ఇక నో టోల్‌గేట్స్
No Tollgate: టోల్‌గేట్ విధానంగా మరో మార్పు రానుంది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ టోల్‌గేట్స్ అమల్లోకి రానుంది. అంటే మీ వాహనం ఎక్కడా ఆగకుండానే పేమెంట్ జరిగే విధానం..ఆశ్యర్యంగా ఉందా..లెట్స్ వాచ్ ద స్టోరీ.
No Tollgate: టోల్‌గేట్ విధానంగా మరో మార్పు రానుంది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ టోల్‌గేట్స్ అమల్లోకి రానుంది. అంటే మీ వాహనం ఎక్కడా ఆగకుండానే పేమెంట్ జరిగే విధానం..ఆశ్యర్యంగా ఉందా..లెట్స్ వాచ్ ద స్టోరీ.
మొన్నటివరకూ జాతీయ రహదారులపై టోల్‌గేట్స్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఒక్కొక్క వాహనం టోల్ డబ్బులు చెల్లించి..రసీదు తీసుకుని..ఛేంజ్ తీసుకుని దాటడం. ఫలితంగా పండుగ సీజన్లలో అయితే భారీగా క్యూ లైన్లు. ఫలితంగా అటు ట్రాఫిక్ జామ్..ఇటు టైమ్ వేస్ట్. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ విధానం విజయవంతమైందనే చెప్పాలి. ప్రతి వాహనంపై ఉండే ఫాస్టాగ్ స్టిక్కర్‌ను టోల్‌గేట్ కెమేరాలు స్కాన్ చేసిన కావల్సిన పేమెంట్ తీసుకుంటాయి. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోతుంది. ఫలితంగా టోల్‌గేట్స్ వద్ద ట్రాఫిక్ తగ్గింది. ప్రతి వాహనం టోల్‌గేట్ దాటేందుకు 1 నిమిషం కూడా పట్టని పరిస్థితి.
నో టోల్‌గేట్స్.. ఓన్లీ జీపీఎస్
ఇప్పుడు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టుబోతోంది కేంద్ర రోడ్డు రవాణా సంస్థ. త్వరలో టోల్‌గేట్లను తొలగించనున్నారు. ఈ విషయాన్ని లోక్‌సభలో స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భవిష్యత్తులో జీపీఎస్ విధానంలో టోల్ వసూలు చేయనున్నామని చెప్పారు. అంటే వాహనానికుండే జీపీఎస్ సిగ్నల్ ద్వారా వాహనం హైవేపై ఎంత దూరం ప్రయాణించిందో లెక్కించి..ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వసూలయ్యేలా కొత్త పద్ధతి ప్రవేశపెట్టనున్నారు. అంటే ఫాస్టాగ్‌నే ఇంకాస్త అభివృద్ధి చేసిన విధానం. అంటే మీరు ప్రయాణించే వాహనం ఎక్కడా ఆగదింక. ప్రయాణిస్తుండగానే..పేమెంట్ జరిగిపోతుంది.
ఇక మరోవైపు దేశంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, రహదారుల్లో ఉన్న రైల్వే గేట్లను తొలగించి..ఆ స్థానంలో 10 వేల కోట్లతో ఉచితంగా వంతెనలు నిర్మించనున్నామని కేంద్రమంత్రి తెలిపారు. జాతీయ రహదారులపై ప్రతి మూడు మీటర్లకు ఒక మొక్క నాటాలనే నిబంధనతో రాజమండ్రి పరిసరాల్లోని నర్శరీలకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని నితిన్ గడ్కరీ చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేను 6 లైన్లుగా విస్తరించాల్సి ఉన్నప్పటికీ చేయకపోవడంపై మంత్రి స్పందించారు. వారం రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తామని..కోర్టు కేసుల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
Also read: Road cum Runways: ఏపీలో హైవేపై రన్‌వేలు, విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook