JEE Mains Exams Schedule: ఐఐటీ , ఎన్ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్ విడుదలైంది. కరోనా సంక్షోభం కారణంగా నిలిచిపోయిన పరీక్షల్ని తిరిగి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మిగిలిపోయిన మూడు, నాలుగు దశల పరీక్షలకు షెడ్యూల్ ఇదే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం(Corona Crisis) కారణంగా దేశవ్యాప్తంగా జరిగే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు నిలిచిపోయాయు. ఐఐటీ, ఎన్ఐటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్షను ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. నాలుగు దశల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష(JEE Mains Exams)ల్లో రెండు దశలు ఇప్పటికే ముగిశాయి. తొలి విడత ఫిబ్రవరిలోనూ, రెండవ విడత మార్చ్ నెలలోనూ జరిగాయి. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన పరీక్షలు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా నిలిచిపోయాయి. విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షల్ని ఎన్‌టిఏ నిలిపివేసింది. వీటికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ (Union Minister Ramesh Pokhriyal) విడుదల చేశారు.


జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్(JEE Mains New Schedule)ప్రకారం మూడవ దశ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకూ, నాలుగవ దశ పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగనున్నాయి. కరోనా నేపధ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్ధులు తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇవాళ రాత్రి నుంచి జూలై 8వ తేదీ రాత్రి వరకూ ఎన్‌టిఏ (NTA) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.


Also read: Sputnik v vaccine: ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్పుత్నిక్ వి చేరిక, త్వరలో అందరికీ అందుబాటులో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook