First Underwater Metro In India: భారత రైల్వే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించేందుకు రైల్వే సేవల్లో మార్పులు తీసుకువస్తూనే ఉంది. భారత రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అండర్ వాటర్ మెట్రో ను లాంచ్ చేయబోతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సేవలు ముందుగా కోల్‌కత్తా ప్రాంతంలోని ప్రయాణికులకు అందుబాటులోకి రానన్నాయి.  ఈ మెట్రో లైన్ ను హుగ్లీ నది అంతర్భాగంలో నిర్మించగా..ఈస్ట్ వెస్ట్ మెట్రో పరిధిలోకి రానుంది. ఇప్పటికే ఈ మెట్రో లైన్లకు సంబంధించిన అన్ని పనులు చివరి దశలో ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరంలోని డిసెంబర్ రెండో వారంలో గా ఈ మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి ఈ మెట్రోకు సంబంధించిన లైన్లన్నీ పరిశీలించారు. కేంద్ర రైల్వే మంత్రి ట్రాలీ గుండా సొరంగంలోకి వెళ్లి మెట్రో పనులను పరిశీలించి అధికారులకు మార్పులు చేర్పులకు వివరించారు. ఇండియాలోనే మొట్టమొదటి సొరంగం గుండా ప్రయాణించే మెట్రో అందుబాటులోకి రావడం విశేషం.  


Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


కేంద్ర ప్రభుత్వం రైల్వే అభివృద్ధికి బడ్జెట్లో భారీ నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో భాగంగానే కోల్‌కత్తాలోని ఈ అండర్ వాటర్ మెట్రోకి కేంద్ర ప్రభుత్వం  భారీ నిధులు కేటాయించింది. ఇప్పటివరకు కేంద్రం ఈ మెట్రో కి రూ. 11,900 కోట్లను కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. త్వరలో నిర్మించబోయే అన్ని మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు కృషిగా సహకరించాలని  కోరారు. 


ఈ మెట్రో 2022 సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేదని.. బౌబజార్ వద్ద సంభవించిన పేలుడు కారణంగా ప్రాజెక్టులోకి నీరు చొచ్చుకు రావడంతో ప్రాజెక్టు మరింత ఆలస్యమైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. ఈ మెట్రో ప్రాజెక్టు తూర్పు పశ్చిమం పొడవునా మొత్తం 16.6 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉండగా..10.8 కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అన్ని ప్రాంతాల్లోకి వెళ్లడం సులభతరం అవుతుందన్నారు.


Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook