చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ఇంకా ఒక్కరోజే ఉంది. ఈ సమయంలో టెన్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ సడన్ గా అపోలో హాస్పిటల్ లో అన్నాడీఎంకే చీఫ్ జయ చనిపోవడానికి ముందు ఎలా ఉందేదో తెలియజేస్తూ ఒక ఫుటేజీ విడుదలైంది. ఈ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆమె చనిపోయే వరకూ ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జయలలిత ప్రాతినిథ్యం వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఆసుపత్రి మంచం మీద కూర్చొని ఉన్నారు.  చేతిలో జ్యుస్ గ్లాస్ పట్టుకొని  ఉండటం మీకు బహుశా పై ఫొటోలో చూడవచ్చు. టిటివి దినకరన్ మద్దతుదారుడు పి.వేత్రీవిల్ ఈ ఫుటేజీ ను విడుదల చేశారు. 



 


మీడియాతో  పి.వేత్రీవిల్ మాట్లాడుతూ, జయను ఆసుపత్రిలో ఎవరూ కలవలేదనటం అబద్దం. వీడియో రుజువు ఉంది. ఈ ఫుటేజీని విడుదల చేయడానికి మేము కొన్ని రోజులు వేచి చూశాం. కానీ విడుదల చేయడం అనివార్యమయింది. జయ మృతిపై ఏర్పాటైన ఎంక్వయిరీ కమీషన్ మమ్మల్ని సంప్రదించలేదు. ఒకవేళ పిలుపు వస్తే రుజువులు అందిస్తాం" అన్నారు. 



 


అపోలో హాస్పిటల్లో 72 రోజులు గడిపిన తరువాత, జయ డిసెంబరు 5, 2016న తుది శ్వాస విడిచారు.  ఆమె మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అనేకమంది  ఆమెది సహజ మరణం కాదని, నిజానికి ఆమె చంపబడ్డారని పేర్కొన్నారు. దినకరన్ క్యాంప్ విడుదల చేసిన ఈ వీడియో ద్వారా 21వ తేదీ పోలింగ్ జరగబోయే ఆర్కే నగర్ లో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.