ఇంటర్‌ పేపర్లు దిద్దే మాస్టర్లు ఆన్సర్ షీట్ ని చూసి షాక్ అయ్యారు. విద్యార్ధులు రాసిన సమాధానాలకి అనుకుంటే పొరబడినట్లే..!  విద్యార్థుల ఆన్సర్ షీట్లలో ఉన్న కరెన్సీని చూసి మాస్టర్లు షాకయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటర్‌ విద్యార్థులు సమాధాన పత్రాల్లో డబ్బులు పెట్టి, ఈ డబ్బులు తీసుకుని నన్ను పాస్‌ చేయండి..సార్ అని రాసి పేపర్ల మధ్యలో నోట్లు పెట్టారు. అవి చూసిన మాస్టర్లకి దిమ్మతిరిగింది.


పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్ అయి పోతామోనని ముందుగానే విద్యార్థులు ఆన్సర్ షీట్లలో రూ.500, రూ.100 నుంచి 50 రూపాయల నోట్లు పెట్టారు. పరీక్షలు రాయకుండా విద్యార్థులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని పేపర్లు దిద్దే మాస్టర్లు అంటున్నారు. అయితే తాము విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగానే మార్కులు ఇస్తున్నామని, ఇలాంటి ట్రిక్స్‌కు, పిచ్చి పనులకు మార్కులు ఇవ్వట్లేదని మాస్టర్లు తెలిపారు.


విద్యార్ధులు విద్యపై సరిగ్గా దృష్టి పెట్టాకుండా, ఇలాంటి పనులు చేస్తే  ఉత్తీర్ణత సాధించలేరని అన్నారు.  ఇప్పటికైనా చదువుపై శ్రద్ధ పెట్టి మంచిగా సమాధానాలు రాసి పాస్‌ కావాల్సింది పోయి.. ఇలాంటి ట్రిక్స్‌కు, పిచ్చి పనులకు పాల్పడటం మంచిది కాదని మాస్టర్లు తెలిపారు. ఇలా చాలా నోట్లు వచ్చాయని.. మేము వాటికి అమ్ముడు పోబోమంటున్నారు మాస్టర్లు.