మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. మాజీ ప్రధాని క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తూ దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాజ్‌పేయితో సాన్నిహిత్యం ఉన్న నేతలు ఆయన్ను నేరుగా పరామర్శించేందుకు ఆస్పత్రికి క్యూ కట్టగా ఇంకొందరు నేతలు వాజ్‌పేయి కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా మారిందనే వార్తల నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ వాజ్‌పేయి గొప్పతనం గురించి చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వాజ్‌పేయి ప్రస్తుత పరిస్థితి గురించి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఒకానొక దశలో కన్నీళ్లు పెట్టుకున్నారాయన. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING