UP bulldozers: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మళ్లీ యాక్షన్ లోకి దిగింది. బుల్డోజర్లను దింపేసింది. అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు యూపీ అధికారులు. ఇటీవలే సహ్రాన్‌పూర్‌లో జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఇండ్లను ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్లతో కూల్చివేశారు స్థానిక అధికారులు. తాజాగా ప్రయాగ్ రాజ్ లో అల్లర్లు జరగడంతో అక్కడ కూడా బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం ప్రయార్ రాజ్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో జావేద్ అహ్మద్ పంప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన ఇంటిని కూల్చేశారు ప్రయాగ్ రాజ్ అధికారులు. వందలాది మంది పోలీసుల పహారాలో జావేద్ ఇంటిని నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  పోలీసులు బుల్డోజర్లతో రావడంతో జావేద్‌ పంప్‌ ఇంటి ముందు హైడ్రామా జరిగింది. నిమిషాల్లోనే ఇంటిని కూల్చేశారు స్థానిక అధికారులు


జావేద్ అహ్మద్ అక్రమంగా ఇంటిని నిర్మించారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. జావేద్ అహ్మద్ కు ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ గత నెలలోనే నోటీసు ఇచ్చింది. పంప్ హౌస్‌ను అక్రమ భవనంగా ప్రకటిస్తూ మే 25న పీడీఏ జావేద్‌ అహ్మద్‌కు ఉత్తర్వులు పంపింది. జూన్ 12న మరోసారి నోటీసులు ఇచ్చింది. శనివారం ఉదయం 11 గంటలలోగా ఇల్లు ఖాళీ చేయాలని.. కూల్చివేసేందుకు బుల్ డోజర్ నడుపుతామని నోటీసులో వెల్లడించింది. అయినా అయినా ఇంటిని ఖాళీ చేయలేదు జావేద్ అహ్మద్.  దీంతో జావేద్ ఇంటికి వచ్చిన అధికారులు.. మొదట సామాగ్రిని బయటకు తెచ్చారు. తర్వాత బుల్డోజర్ తో ఇంటిని నేలమట్టం చేశారు.


యూపీలో అల్లర్లకు పాల్పడితే  కఠినంగా శిక్షించాలని గతంలోనే సీఎం యోగీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.శుక్రవారం జరిగిన అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ గా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది. నిందితుల ఇళ్లను కూల్చివేయాలని ఆదేశించింది. ప్రయాగ్ రాజ్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 304 మందిని పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో 91 మంది, అంబేద్కర్‌నగర్‌లో 34,  సహ్రాన్‌పూర్‌లో 71 మంది, హాథ్రస్‌లో 51 మంది, మురాదాబాద్‌లో 31 మందిని అరెస్ట్‌ చేశారు.


Read also: Hyderabad Blast: హైదరాబాద్ లో కలకలం.. పాతబస్తీలో పేలుడు.. ఒకరు మృతి


Read also: President election: వెంకయ్య నాయుడికి నిరాశే.. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ఉప రాష్ట్రపతిగా నక్వీ?    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి