UPSC chairman manoj soni resigns five years before end of term: ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ  ఐఏఎస్ అధికారిణి పూజాఖేడ్కర్ ఘటన పెనుసంచలనంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ బోర్డును సైతం ఆమె మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చాయి. ఆమె యూపీఎస్సీలో సబ్మిట్ చేసిన అనేక సర్టిఫికేట్ లు ఫెక్ అని బైటపడ్డాయి. అంతేకాకుండా.. ఆమె వికలాంగ కోట సర్టిఫికేట్, ఓబీసీ కోటా మొదలైన వాటిలో నకిలీ సర్టిఫికెట్ లను సబ్మిట్ చేసి యూపీఎస్సీ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Crows: చికెన్ షాపు మీద యుద్ధం ప్రకటించిన కాకులు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..


పూజాఖేడ్కర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా 821 ర్యాంక్ ను సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్  కోసం పూణేకు పంపించారు. అనూహ్యంగా అక్కడ వివాదాలతో ఆమె వార్తలలో నిలిచారు. ఆతర్వాత ఆమెపై విచారణ జరపగా షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. ఏకంగా ఆమెను యూపీఎస్సీ వెనక్కు పిలిపించుకుని, ఆమె అభ్యర్థిత్వాన్ని సైతం రద్దు చేసింది. క్రిమినల్ కేసులను కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా, యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.


పూర్తి వివరాలు..



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. ఆయన పదవి పూర్తవ్వడానికి ఇంకా  ఐదేళ్లు ఉండగానే రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన మనోజ్ సోని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆయన వ్యక్తిగత కారణాలతోనే పదిహేను రోజులక్రితమే రాజీనామా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజీనామాను ఇంకా ఆమోదించలేదని పేర్కొన్నారు.


సోనీ యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఉండటానికి ఆసక్తి చూపడం లేదని, రిలీవ్ కావాలనుకుంటున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే సోనీ పదవీకాలం 2029తో ముగియనుంది. 2023 ఏప్రిల్‌లోనే బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడం వార్తలలో నిలిచింది. 2017 లో యపీఎస్సీలో సభ్యుడినిగా చేరి, గతేడాది మే నెలలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మనోజ్ సోనీకి.. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నట్లు సన్నిహితులు అంటున్నారు.


Read more: SPos lathi charge: సీఎం నివాసంలో హైటెన్షన్.. పోలీస్ వర్సెస్ పోలీస్.. ఒకరిపై మరోకరు లాఠీచార్జీ.. వీడియో వైరల్..


గతంలో వైస్ ఛాన్సలర్‌గా..


యూపీఎస్సీలో నియామకానికి ముందు సోని మూడు పర్యాయాలు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. వీటిలో గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BAOU) VCగా ఆగస్టు 1, 2009 నుంచి జులై 31, 2015 వరకు వరుసగా రెండు పర్యాయాలు విధులు నిర్వహించారు. 2005 ఏప్రిల్ నుంచి 2008 ఏప్రిల్ వరకు బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (MSU) VCగా ఉన్నారు. ఎంఎస్ యూలో పని చేస్తున్న సమయంలో.. సోనీ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి