UPSC Civils 2023 Results: ఆఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్‌లలో నియామకానికై నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సివిల్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు విద్యార్ధులు సివిల్స్‌లో సత్తా చాటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీఎస్సీ 2023 సివిల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ర్యాంకుల్ని బట్టి ఐఏఎస్, ఐపీఎస్ కేటగరీ కేటాయిస్తారు. ఈసారి సివిల్స్ పరీక్షల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. మొదటి ర్యాంకును ఆదిత్య శ్రీవాత్సవ, రెండవ ర్యాంకును అనిమేష్ ప్రదాన్ దక్కించుకోగా మూడో ర్యాంకును తెలుగమ్మాయి అనన్యా రెడ్డి కైసవం చేసుకుంది. యూపీఎస్సీ ఎంపిక చేసిన మొత్తం 1016 మందిలో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగరీ నుంచి 115, ఓబీసీ కేటగరీలో 303, ఎస్సీ కేటగరీలో 165, ఎస్టీ నుంచి 86 మంది ఉన్నారు. ఇక ఐఏఎస్ కేటగరీకు 180 మంది ఎంపికైతే, ఐపీఎఎస్ కేటగరీకు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ కేటగరీలో 613 మంది, గ్రూప్ బి కేటగరీలో 113 మంది ఉన్నారు. 


యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో మొదటి ర్యాంకును ఆదిత్య శ్రీవాత్సవ కైవసం చేసుకోగా రెండో ర్యాంకును అనిమేష్ ప్రధాన్ దక్కించుకున్నాడు. తెలుగమ్మయి దోనూరు అనన్యా రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక పీకే సిద్ధార్ధ్ రామ్ కుమార్ 4వ ర్యాంకును, రుహానీ 5వ ర్యాంకును సాధించారు. సృష్టి దబాస్ ఆరవ ర్యాంకును, అన్మోల్ రాథోడ్ 7వ ర్యాంకును ఆశిష్ కుమార్ 8వ ర్యాంకును, నౌషీన్ 9వ ర్యాంకు, ఐశ్వర్యం ప్రజాపతి 10వ ర్యాంకు సాధించారు. 


ఇక ఇతర ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్ధుల్లో నందల సాయికిరణ్ 27వ ర్యాంకు, మేరుగు కౌశిక్ 22వ ర్యాంకు, పెంకీసు ధీరజ్ రె్డ్డి 173వ ర్యాంకు, జి అక్షయ్ దీపక్ 196వ ర్యాంకు, గనసేన భానుశ్రీ 198వ ర్యాంకు, నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డికి 382వ ర్యాంకు, బన్న వెంకటేశ్ కు 467వ ర్యాంకు, పూల ధనుష్‌కు 480వ ర్యాంకు, కే శ్రీనివాసులుకు 526వ ర్యాంకు, నెల్లూరు సాయితేజకు 558 వ ర్యాంకు, ఫి భార్గవ్ 590వ ర్యాంకు, కే ఆర్పిత 639వ ర్యాంకు, ఐశ్వర్య నెల్లి శ్యామలకు 649 వ ర్యాంకు దక్కాయి. 


యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు 2023 మే 28న జరగగా, మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించారు. ఇక 2024 జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 వరకూ వివిధ దశలుగా మౌఖిక ఇంటర్వ్యూలు జరిగాయి. 


యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల కోసం ముందుగా upsc.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్‌లో వాట్స్ న్యూ సెక్షన్ దిగువన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ 2023 ఫైనల్ రిజల్ట్స్ లింక్ క్లిక్ చేయాలి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల పేర్లతో కూడిన పీడీఎఫ్ ఉంటుంది. 


Also read: Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష, పోటీకు అనర్హుడేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook\