UPSC Civil Exam: నేడు సివిల్ ప్రిలిమినరీ పరీక్ష
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
UPSC PRELIMS EXAMINATION: ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ రోజు జరగనున్న సివిల్ సర్వీస్ ( UPSC Pre Civil Exam) పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలతో, సోషల్ డిస్టెన్సింగ్‌తో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే.. సివిల్ పరీక్షల నిర్వహణ కోసం యూపీఎస్సీ దేశంలోని 72 ప్రధాన నగరాల్లో 2,569 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష రెండు సెషన్లల్లో ఉదయం, మధ్యాహ్నం జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. Also read: Harthras Case: హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి
ఇదిలాఉంటే.. కోవిడ్ నిబంధనలతో ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఫెస్ మాస్కులుంటేనే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు సర్వీసులను పెంచాయి. దీంతోపాటు యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో మెట్రో సర్వీసులను కూడా ప్రారంభించారు. అయితే ఈ పరీక్ష ఫలితాలను నెలరోజుల్లో వెల్లడించే అవకాశముంది. ఇదిలాఉంటే.. కరోనావైరస్ ( covid-19) వ్యాప్తి, వరదల నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. Also read: DC vs KKR: షార్జా స్టేడియంలో అంత ఈజీ కాదు: Shreyas Iyer