UPSC Prelims Result-2022: సివిల్స్-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల..అభ్యర్థులు వీరే..!
UPSC Prelims Result-2022: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడొచ్చు..
UPSC Prelims Result-2022: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. సివిల్స్ మెయిన్స్‌కు మొత్తం 13 వేల 90 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 6న సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష జరిగింది.
ప్రతి ఏటా యూపీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇస్తూ వస్తోంది. ఈసారి 8 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్ష ముగిసిన మూడు వారాల లోపే ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రిలిమ్స్‌లో పాస్ అయిన వారు మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. త్వరలో ఈపరీక్ష షెడ్యూల్ రానుంది. యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్‌తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాలను విడుదల చేసింది.
ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష కోసం డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్-1ను పూర్తిగా నింపాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని త్వరలో యూపీఎస్సీ విడుదల చేయనుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తుది ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ప్రిలిమ్స్ మార్కులు, కటాఫ్ మార్క్స్ వంటి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు ఇలా చూడండి..
-upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
-కనిపించే వెబ్ పేజీలో సివిల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఎస్ కోసం యూపీఎస్సీ ప్రిలిమ్స్ లింక్‌పై క్లిక్ చేయండి
-యూపీఎస్సీ ఫలితాల పీడీఎఫ్ 2022 ఓపెన్ అవుతుంది
-అభ్యర్థులు కిందకు వెళ్తూ వారి రోల్ నంబర్‌ను తనిఖీ చేసుకోవచ్చు
Also read:UPSC Prelims Result-2022: సివిల్స్-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల..అభ్యర్థులు వీరే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.