UPSC Recruitment 2023: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ ఇతర పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇతర వివరాలను పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 విడుదలైంది. వేర్వేరు శాఖల్లో వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రక్రియ అక్టోబర్ 14 నుంచి ప్రారంభమైంది. ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అర్హత వివరాలు యూపీఎస్‌సి అధికారిక వెబ్‌సైట్  https://upsc.gov.inలో చూడవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 2గా ఉంది. పోస్టుల్ని బట్టి విద్యార్హత, వయో పరిమితి వేర్వేరుగా ఉంటాయి. నోటిఫికేషన్‌లో ఉన్న సమాచారం ప్రకారం అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 12, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ పోస్టు 1, డ్రిల్లర్ ఇన్‌ఛార్జ్ పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్టు కూడా ఒకటి ఖాళీగా ఉంది. 


ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు మాత్రం 25 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుమును ఏదైనా ఎస్బీఐ శాఖలో లేదా యూపీ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఎలాగైనా చెల్లించవచ్చు. 


Also read: IT Raids: ఏకకాలంలో దేశంలో 55 ప్రాంతాల్లో ఐటీ దాడులు, 94 కోట్ల నగదు స్వాధీనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook