Rape in Uttar Pradesh: ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తుండగా.. కదులుతున్న కారులో యువతిపై రేప్
Rape in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మథురకి చెందిన 21 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తున్న ఆమెపై తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు.
Rape in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తున్న మహిళ అత్యాచారానికి (Rape) గురైంది. సోషల్ మీడియా ద్వారా ఆమెకు పరిచయమైన యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కదలుతున్న కారులోనే ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారం అనంతరం ఆమెను కారులో నుంచి హైవేపై విసిరేసి పారిపోయాడు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కోసికల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మథురకి చెందిన 21 ఏళ్ల యువతికి హర్యానాలోని పాల్వల్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడితో 3 నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. మంగళవారం (నవంబర్ 23) ఆ యువతి ఆగ్రాలో (Agra) ఎస్సై పరీక్ష రాయాల్సి ఉంది. ఇదే విషయం అతనికి చెప్పడంతో తన కారులో మథురకి వచ్చాడు. యువతిని కారులోని ఎక్కించుకుని ఆగ్రాలోని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు.
పరీక్ష అనంతరం యువతిని కారులో ఎక్కించుకుని తిరిగి మథురకు బయలుదేరాడు. ఆ సమయంలో వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేయగా... యువతి, యువకుడు కారు వెనకాల సీట్లో కూర్చొన్నారు. ఆపై యువతికి మత్తు మందు ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి (Girl raped in moving car) పాల్పడ్డాడు. అనంతరం ఢిల్లీ-ఆగ్రా హైవేపై కోసికల సమీపంలో కారు నుంచి ఆమెను బయటకు విసిరేశాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read: AP Rains: ఏపీకి మరోసారి వర్ష సూచన- పలు చోట్ల భారీ వానలకు అవకాశం!
యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం వారిని వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (Rape) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఇంటి చిరునామా తనకు తెలియదని యువతి పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook