Uttar Pradesh: అదుపుతప్పి చెరువులో ట్రాక్టర్ బోల్తా... 10 మంది మృతి, పలువురికి గాయాలు..
Lucknow News: ఆలయానికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడిపోయిన ఘటనలో 10 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని లక్నో జిల్లాలో జరిగింది.
Lucknow News: యూపీలోని లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెరువులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బక్షి కా తలాబ్ ప్రాంతంలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా నవరాత్రుల తొలి రోజు పూజలు చేయడానికి మోహనా నుండి చంద్రికా దేవి గుడికి బయలుదేరారు. ఈ ఘటన ఇటౌంజా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం 47 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది క్షతగాత్రులను ఇటౌంజా సిహెచ్‌సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పలువురు ప్రయాణీకులు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది మృతదేహాలను బయటకు తీశారు. మరికొంత మంది కోసం గాలిస్తున్నారు.
''ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బ్యాలెన్స్ తప్పి ఇటౌంజాలోని చెరువులో బోల్తా పడింది. వీరంతా గుడికి వెళుతున్నారు. SDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని 37 మందిని రక్షించింది. ఆసుపత్రిలో 10 మంది మరణించారు". అని లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీ సింగ్ తెలిపారు.
Also Read: Kullu road accident: కులులో ఘోర ప్రమాదం... లోయలో పడిన టెంపో.. ఏడుగురు టూరిస్టులు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook