MLA Daughter Death: బీజేపీ ఎమ్మెల్యే కూతురి మృతి.. నిద్రలోనే మరణం.. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏం తేలిందంటే..
MLA Daughter Sudden Death in Sleep: ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు నిద్రలోనే మృతి చెందారు. భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
MLA Daughter Sudden Death in Sleep: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్ మౌర్య (32) గురువారం (ఆగస్టు 25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆమె శ్వాస నాళంలో ఆహారం ఇరుక్కుపోవడం వల్లే మృతి చెందినట్లు వెల్లడైంది. నిద్రిస్తున్న సమయంలో గురక కారణంగా శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోయి ఊపిరాడక నిద్రలోనే మృతి చెందినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రతాప్‌గఢ్ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కూతురైన పూనమ్ మౌర్య పెళ్లి తర్వాత భర్తతో కలిసి భోపాల్‌లో నివాసముంటోంది. పూనమ్ మౌర్యకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంది. గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గురక పెట్టింది. ఆమె భర్త సంజయ్ గురువారం తెల్లవారుజామున నిద్ర లేచే సరికి పూనమ్ అపస్మారక స్థితిలో బెడ్‌పై కనిపించింది. వెంటనే పూనమ్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. కానీ అప్పటికే పూనమ్ మృతి చెందినట్లు ఆ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
పూనమ్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆమె శ్వాసనాళంలో ఆహారం అడ్డుపడినట్లు తేలింది. నిద్రలో గురక కారణంగా ఆహారం శ్వాసనాళంలోకి వచ్చి ఇరుక్కుపోయినట్లు వెల్లడైంది. ఈ కారణంగా ఆమెకు శ్వాస ఆడక నిద్రలోనే మృతి చెందింది. ఇలాంటి కేసుల్లో సైలెంట్ డెత్‌కి ఎక్కువ అవకాశం ఉంటుందని... పూనమ్ కౌర్‌కి కూడా అదే జరిగిందని వైద్యులు తెలిపారు. పూనమ్ కౌర్ మృతితో ఆమె భర్త, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook