ఈ నెల 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పదవీ విరమణ పొందనుండటంతో 15వ తేదీ కంటే ముందుగానే అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్ర్రాలతో పాటు ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: అయోధ్య కేసు తీర్పు: అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం


ఇదిలావుండగా, తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సైతం ఉత్తర్ ప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు యూపీ సీఎస్, ఆ రాష్ట్ర డీజీపిలతో సుప్రీం కోర్టులోని చీఫ్ జస్టిస్ చాంబర్ లో ఈ భేటీ జరగనుంది. దశాబ్ధాల తరబడి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.