Asaduddin Owaisi in UP Politics: యూపీలో అసదుద్దీన్ ఓవైసీ డక్ అవుట్
Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది.
Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది. కేవలం ముభారక్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరపున బరిలోకి దిగిన షా అలాం అలియాస్ గుడ్డు జమాలి మినహా ఏ ఒక్కరు కనీసం డిపాడిట్లు కూడా సాధించుకోలేకపోయారు. వంద అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 99 స్థానాల్లో మజ్లీస్ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. ముస్లింలు అత్యధికంగా ఉండే డియోబాంద్ నుంచి ఎంఐఎం పార్టీ తరపున పోటీచేసిన మౌలానా ఉమీర్‌కు కేటాయించినప్పటికి ఫలితం లేకపోయింది. ఆయనకు కేవలం 3501 ఓట్లకు మాత్రమే వచ్చాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ ఎన్నో వ్యూహాలు రచించినా ఎంత మంది అభ్యర్దులను రంగంలో నిలబెట్టినా ఫలితం దక్కడం లేదు.
ముఖ్యంగా వారణాసి నార్త్ అసెంబ్లీ సీటును నాన్ ముస్లిం క్యాండిడెడ్ హరీష్ మిశ్రాకి సీటు కేటాయించి కొత్త స్ట్రాటజీని ఫాలో అయింది మజ్లీస్ పార్టీ. అయితే ఇక్కడ కూడా ఓవైసీ పాచిక పారలేదు. ఇక్కడ కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2017ఎన్నికల్లో యూపీలో ఎంఐఎం 38 మంది అభ్యర్ధులు పోటీ చేస్తే మొత్తం రెండు లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 100 చోట్ల బరిలోకి దిగితే కేవలం 22 లక్షల ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. బీజేపీని ఇంటికి పంపిస్తామంటూ అసదుద్దీన్ చేసిన ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్స్ ను యూపీ ప్రజలు నమ్మలేదు. గతంలో కంటే రెండు శాతం అధికంతో కేవలం 0.4శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది మజ్లీస్ పార్టీ. యూపీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ప్రజాతీర్పును గౌరవిస్తానని చెప్పడం గమనార్హం.
అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్‌కి సమీపంలో క్యాంపెయిన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా పతాకశీర్షికలకెక్కింది. ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. తనని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీపై మైనార్టీల్లో కొంత సానుభూతి వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ సానుభూతి ఓట్లుగానూ మారే అవకాశం లేకపోలేదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ యూపీ ఎన్నికలు ఫలితాలు (UP Elections Results 2022) మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పకనే చెప్పేశాయి.
Also read : Rasamayi Balakishan: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అసెంబ్లీలో చేదు అనుభవం!
Also read : Crime News: థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయ్యారం ఎస్సై రమాదేవి.. నడవలేని స్థితిలో నిందితుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook