Uttar Pradesh: ఘోరం.. ఏడుగురు చిన్నారులతో సహా 15 మంది దుర్మరణం.. అసలేం జరిగిందంటే ..?
Devotees Died: కస్గంజ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అమాయక పిల్లలు, ఎనిమిది మంది మహిళలు చనిపోయారు. ఘటన స్థలంలో అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా గందర గోళంగా మారింది.
Kasganj Tractor Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కస్గంజ్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడింది. శనివారం ఉదయం.. భక్తులతో నిండిన ట్రాక్టర్ వెళ్తుంది. ఈక్రమంలో ఒక్కసారిగా చెరువు వద్ద అదుపు తప్పి నీళ్లలోకి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అమాయక పిల్లలు, ఎనిమిది మంది మహిళలు చనిపోయారు.
ఘటనా స్థలంలో స్థానికులు, పోలీసులు చేరుకున్నారు. చనిపోయిన వారి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసలు సహాయక చర్యలను ప్రాంభించారు. శనివారం.. ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి పటియాలీ-దరియావ్‌గంజ్ రహదారిలోని చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో.. ఎక్కువ మంది భక్తులు జల సమాధి అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మందికి పైగా మరణింనట్లు అధికారులు గుర్తించారు.
మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన పలువురు భక్తులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు గందరగోళ వాతావరణం నెలకొంది. DM, SP మరియు ఇతర పరిపాలనా, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం చేయాలని అధికారులకు ఆదేశించారు.
Read More: Shraddha Srinath: చీరకట్టులో కైపేక్కిస్తున్న శ్రద్దా శ్రీనాథ్.. మతిపోగొడుతున్న లేటేస్ట్ పిక్స్..
పాటియాలీలోని సిహెచ్‌సిలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు చనిపోయినట్లు ప్రకటించినట్లు సిఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook