Atiq Ahmed, Ashraf Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రయాగ్ రాజ్‌లో ఆతిక్ అహ్మద్, అశ్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షలకు తీసుకెళ్లే క్రమంలో పోలీస్ జీపు దిగిన తరువాత ఆ ఇద్దరూ మీడియాతో మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


పోలీసుల అదుపులో ఉన్న సోదరులు ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే వెనుకవైపు నుంచి వచ్చిన వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో షూట్ చేసిన దృశ్యాలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.



 


ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



రెండు రోజుల క్రితమే గ్యాంగ్‌స్టర్ ఆతిఖ్ అహ్మద్ తనయుడు అసద్ అహ్మద్‌ని ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మట్టుపెట్టారు. ఉమేష్ పాల్ అనే న్యాయవాది మర్డర్ కేసులో 19 ఏళ్ల అసద్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఉమేష్ పాల్‌ని చంపాల్సిందిగా హంతకులకు అసద్ అహ్మద్ సుపారీ ఇచ్చినట్టు పోలీసుల వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లోనే అసద్ అహ్మద్ పెళ్లి జరగనుండగా అతడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. 


ఆతిఖ్ అహ్మద్ సోదరి ఆయేషా నూరి కూతురిని అసద్ అహ్మద్ వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి రెండు రోజుల క్రితమే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కాగా ఉమేష్ పాల్ మర్డర్ కేసులో ఆయేషా నూరీ, ఆమె కూతురి పేర్లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఉమేష్ పాల్‌ని చంపిన హంతకులకు ఆశ్రయం ఇచ్చినట్టుగా పోలీసులు వారిపై అభియోగాలు మోపారు. దీంతో అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్ అయిన మరుసటి క్షణం నుంచే ఆయేషా నూరీ, ఆమె కూతురు ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ఇది కూడా చదవండి : CBI Summons Arvind Kejriwal: దమ్ముంటే ఆ పని చేయ్.. కేజ్రీవాల్‌కి బీజేపి సవాల్


ఇదిలావుండగానే, తాజాగా ఆతిఖ్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రష్ అహ్మద్‌లను కూడా గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఆతిఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్, కుమారుడు అసద్ అహ్మద్.. ఇలా ముగ్గురూ రెండు రోజుల వ్యవధిలోనే హతమవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ వరుస పరిణామాలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమయ్యాయి.


ఇది కూడా చదవండి : CAPF Constable Exam: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో సీఏపీఎఫ్‌ పరీక్ష!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK