Zika Virus in Kanpur: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్‌(Zika Virus In Kanpur) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాన్పూరులో గురువారం కొత్తగా 30 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో ఆ నగరంలో వైరస్​ బాధితుల సంఖ్య 66కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాన్పుర్​లో మొదటిసారి అక్టోబర్​ 23న ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ స్టేషన్​ ప్రాంతం (Indian Air Force station area)లో జికా కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​​ ప్రాంతంగా అధికారులు పరిగణించారు. ఇప్పటివరకు కొత్త జికా కేసులు(New Zika virus Cases) ఆ ప్రాంతంలోనే నమోదవుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం 30 కేసులు కొత్త  ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు నమోదైన రోజూవారి కేసుల్లో ఈ రోజే అత్యధికంగా(30) నమోదయ్యాయి.


Also Read: Bihar spurious liquor: బిహార్‌లో పండుగ పూట విషాదం..కల్తీ మద్యం తాగి 24 మంది మృత్యువాత


వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం (Zika virus treatment) కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు.జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో (Zika virus vaccine) గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియా(Nigeria)లో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి