Bipin Rawat's Brother Joins BJP:  గత నెలలో మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat) సోదరుడు కల్నల్ విజయ్ రావత్ (Colonel Vijay Rawat) ఉత్తరాఖండ్ ఎన్నికలకు (Uttarakhand Polls) ముందు బీజేపీలో చేరారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మా నాన్న (జనరల్ లక్ష్మణ్ సింగ్ రావత్) ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత  ప్రత్యేకమైనది. ఆయన కృషి అంతా ఈ దేశ ప్రగతి కోసమే. నన్ను బీజేపీలో చేరమని ప్రోత్సహించారు. ఉత్తరాఖండ్ కోసం ఆయన రూపొందించిన ప్రణాళిక  అద్భుతమని'' కల్నల్ విజయ్ రావత్ అన్నారు.


Also Read: Goa assembly Elections: గోవా ఆప్​ 'సీఎం' అభ్యర్థిగా అమిత్​ పాలేకర్​


కల్నల్ రావత్‌ను పార్టీలోకి స్వాగతించిన ముఖ్యమంత్రి ఆయన సోదరుడిని గుర్తు చేసుకున్నారు. "జనరల్ రావత్ ఉత్తరాఖండ్‌లో మరింత పని చేయాలని కోరుకున్నాడు. వారి కుటుంబం మూడు తరాలుగా ఆర్మీలో ఉంది. అతని సోదరుడు మాతో చేరినందుకు సంతోషంగా ఉంది'' అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ (CM  Pushkar Singh Dhami) అన్నారు. ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 14న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10 ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ (BJP), కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ndroid Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook