Uttarakhand floods: ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు(Heavy Rains in Uttarakhand)అతలాకుతలం చేస్తున్నాయి. వర్ష బీభత్సానికి నదులు, వాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీటి(Uttarakhand floods)తో జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా హృదయ విధారకర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. ముంపు ప్రాంతాలు మొత్తం మునిగిపోయాయి. ఇళ్లపై కప్పులపై జనాలు నిలబడి కాపాడమని వేడుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలోనే ఉండి ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, బ్రిడ్జి కూలుతున్న వీడియా వైరల్


అయితే వేగంగా వెళుతున్న వరదనీటికి భయపడి కొంతమంది ఒక చిన్న గదిలో ఉండిపోయారు. వారిని కాపాడటానికి ఇండియన్ ఆర్మీ సైనికులు(Soldiers save people) చాలా కష్టపడ్డారు. ఒకరికి ఒకరు చేతులు పట్టుకొని వరద నీటికి ఎదురుగా నిలిచి వారిని భుజాలపైకి ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చారు. వీడియో పడిపోతూ లేస్తూ ప్రజలను కాపాడుతున్న సైనికులను మనం గమనించవచ్చు. వరద ప్రవాహం చాలా దారుణంగా ఉంది. కొంచెం మిస్సయినా అందరు వరదప్రవాహానికి కొట్టుకుపోతారు. వీడియో చూసిన జనాలు సైనికుల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. సోల్జర్స్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.



గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే వరదనీటిలో ఎంతమంది గల్లంతు అయ్యారో తెలియాల్సి ఉంది. వరద ప్రవాహానికి ఆనకట్టలు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. గంగానది నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. హరిద్వార్ లోని గంగానదికి సమీపంలో ఉన్న ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కోసి నదిలో నీరు పెరగడం వల్ల రాంనగర్ గార్జియా దేవాలయానికి ముప్పు ఏర్పడింది. ఆలయం మెట్లు వరకు నీరు చేరింది. 10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి