Vaccination for 15-18 years: జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ : ప్రధాని నరేంద్ర మోదీ
Breaking News Vaccination for 15-18 years from January 3: వచ్చే ఏడాది జనవరి 3 నుంచి...15 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ముందుస్తు జాగ్రత్తగా మరో డోస్ అందిస్తామని ఆయన తెలిపారు.
Vaccination for 15-18 years from January 3: Prime Minister Narendra Modi to Address the Nation : దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచించారు మోదీ. చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మోదీ (Prime Minister Narendra Modi) సూచించారు.
Also Read : Omicron Scare: తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు- న్యూ ఇయర్ వేడుకలు బంద్!
వచ్చే ఏడాది జనవరి 3 నుంచి.. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ముందుస్తు జాగ్రత్తగా మరో డోస్ అందిస్తామని ఆయన తెలిపారు. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కూడా వైద్యుల సిఫార్సుపై బూస్టర్ డోస్ తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. దీన్ని కూడా జనవరి 10 నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, అప్రమత్తంగా ఉండాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు.. జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అని మోదీ సూచించారు.
ఇక దేశంలో ఇప్పటికే తొంభై శాతం మంది వయోజనులకు కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఒమిక్రాన్ విషయంలో రకరకాల వదంతులు వ్యాప్తిస్తున్నాయని వాటిని నమ్మవద్దని సూచించారు ప్రధాని. ఒమిక్రాన్ విషయంలో ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ తయారీ కోసం, పంపిణీ కోసం నిరంతరం పని చేస్తున్నామని మోదీ తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తామన్నారు. దాదాపుగా పదకొండు నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Also Read : Telangana Omicron Cases : తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు.. మొత్తం 41 కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి