రాజ్యసభలో కంటతడి పెట్టుకున్న వెంకయ్య నాయుడు
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : సభలో కంటతడి పెట్టుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు.
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం సభలో కంటతడి పెట్టుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament session) సందర్భంగా సభ జరగకుండా నిత్యం నిరసనలు వ్యక్తంచేస్తూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు వ్యవహరిస్తున్న తీరును వెంకయ్య నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. సభలో పోడియం చుట్టుముట్టి నిరసనలు తెలియడంలో ఎంపీలు శృతిమించి ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర మనస్థాపానికి గురిచేస్తోందని అన్నారు. ముఖ్యంగా నిన్న మంగళవారం సభలో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్ (Rajya sabha Chairman) ముందు ఉండే బల్లలపైకి ఎక్కి రభస చేయడమే కాకుండా చైర్మన్ వైపు పేపర్లు విసరం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. సభ దేవాలయం అయితే, సభలో చైర్మన్ ముందు సభలోని అధికారులు, సెక్రెటరీ జనరల్, ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది కూర్చుని ఉండే ప్రాంతం గర్భగుడిలాంటిదని (sanctum sanctorum) చెబుతూ.. అలాంటి గర్భగుడిలో ఎంపీలు తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించారని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మన దేశంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు అని రకరకాల ప్రార్థనా మందిరాలు ఉన్నాయని, ఆయా ప్రార్థనా మందిరాల పట్ల ఎలాగైతే భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారో పార్లమెంట్ పట్ల కూడా అలాంటి భావనే కలిగి ఉండి సభను గౌరవించాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తిచేశారు. మంగళవారం నిండు సభలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు ప్రవర్తించిన తీరు తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. ఆ బాధతో నిన్న రాత్రంతా నిద్రపట్టలేదని (Sleepless night) అన్నారు. సభలో ప్రతిపక్ష ఎంపీల తీరు పట్ల తన ఆవేదనను వెలిబుచ్చే క్రమంలో వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురై కంటతడి (Venkaiah Naidu breaksdown) పెట్టుకున్నారు.
Also read : Removal of Article 370: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో పరిణామాలు ఎంత వరకూ మారాయి
ప్రభుత్వం తీసుకొచ్చే ఏదైనా బిల్లులను ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకించినట్టయితే.. శాంతిమార్గంలో నిరసన వ్యక్తంచేసి ఓటింగ్ రూపంలో తమ వ్యతిరేకతను తెలియచేయవచ్చని తెలిపారు. ఇకనైనా సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు పలికారు.
Also read : GSLV - F10 launch : జీఎస్ఎల్ వి - ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం రేపు, ప్రారంభమైన కౌంట్‌డౌన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook