Venkaiah Naidu Corona: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా పాజిటివ్
Venkaiah Naidu Corona: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఐసోలేషన్ కు తరలించినట్లు వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది.
Venkaiah Naidu Corona: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆదివారం ఆయనకు నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది.
"హైదరాబాద్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చేసిన కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన్ని కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు" అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది.
దీంతో బుధవారం జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఆ ప్రకటనలో పేర్కొంది.
Also Read: Delhi Fire Breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు!!
Also Read: Himachal Pradesh Night Curfew: లాక్ డౌన్ దిశగా మరో రాష్ట్రం.. హిమాచల్ ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.