Vice President Of Bharat: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 25న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఐసీఏఆర్ - కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ఫేస్ టూ ఫేస్ సదస్సులో  పాల్గొననున్నారు. అదే రోజు రాత్రి కన్హా శాంతివనంలో బస చేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26న ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనపై సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతిగా.. రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సారి జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆయనపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు అధికార భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తురన్న కారణంతో  అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. కానీ తీరా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నందున దాన్ని రాజ్యసభ తిరస్కరించింది. మరోవైపు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టి తీరుతాం అంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ పేర్కొన్నారు.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.