Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!
హైవే రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కులో అకస్మాత్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియని డ్రైవర్ అలానే హైవే రోడ్డుపై 4 కిలోమీటర్ల దూరం నడుపుకుంటూ వెళ్లాడు.
Burning Truck running for at least 4km: హైవే రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కులో అకస్మాత్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియని డ్రైవర్ అలానే హైవే రోడ్డుపై 4 కిలోమీటర్ల దూరం నడుపుకుంటూ వెళ్లాడు. చివరకు రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి అసలు విషయం చెప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్.. ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే...
శుక్రవారం సాయంత్రం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హైవేపై పశుగ్రాసం లోడుతో ఓ ఐచర్ ట్రక్కు వెళుతోంది. పాల్ఘర్‌లోని శిర్సాద్ ఫాటా సమీపంలోకి రాగానే.. ట్రక్కులో అకస్మాత్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ట్రక్కు వెనకబాగంలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ గుర్తించలేకపోయాడు. విషయం తెలియని డ్రైవర్ అలానే హైవే రోడ్డుపై 4 కిలోమీటర్ల దూరం నడుపుకుంటూ వెళ్లాడు.
ట్రక్కు మంటల్లో కాలిపోతూ రోడ్డుపై పరుగెత్తుతుండటం చూసిన మరో వాహన దారు డ్రైవర్‌కి విషయం చెప్పాడు. వెంటనే ట్రక్కును ఆపిన డ్రైవర్ అందులోని దిగిపోయాడు. అక్కడే ఉన్న వాహనదారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. పాల్ఘర్‌లోని వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే పశుగ్రాసం కాలిపోగా.. ట్రక్కు పూర్తిగా ధ్వంసం అయింది.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ... 'విషయం తెలిసిన వెంటనే మంటలను ఆర్పడానికి రెండు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మా సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ట్రక్కు పూర్తిగా ధ్వంసమైంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం' అని తెలిపారు.
Aslo Read: Viral Video: ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ.. ఊహించని పని చేసిన ఫ్యాషన్ మోడల్ (వీడియో)!!
Also Read: IPL 2022 Mega Auction: శుభ్‌మన్ గిల్‌ను వదులుకోవడం తప్పే..కేకేఆర్ జట్టు కోచ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook