Viral Video: ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి వేడుకలో అనుకోని సంఘటన జరిగింది. పెళ్లి జరుగుతున్న వేదికపై వధువు ప్రేమికుడు వచ్చి గందరగోళాన్ని సృష్టించాడు. దీంతో వధూవరుల కుటుంబాలు సహా పెళ్లికి వచ్చిన అతిథులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


ఉత్తరప్రదేశ్ లోని ఘోరఖ్ పూర్ లో ఓ వివాహం జరుగుతుంది. ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతున్న వేళ ఓ అనూహ్య సంఘటన అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.


పెళ్లి వేదికపై ఉన్న వధూవరులు పూలదండలు మార్చుకుంటున్న క్రమంలో వేదికపై ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడి వచ్చిన ఆ వ్యక్తి బలవంతంగా వధువు నుదుటిన సింధూరాన్ని పెట్టడం సహా తనతో తెచ్చుకున్న కుంకుమను.. గుప్పెడతో ఆమెపై చల్లాడు.


దాంతో అప్పటి వరకు ప్రశాంతగా ఉన్న పెళ్లి మండపం రసాభాసగా మారింది. అతడి దాడి చేసిన పెళ్లి పెద్దలు అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



అయితే అతడు మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలిసింది. ఆ వ్యక్తి పెళ్లి కుమార్తెను ప్రేమించిన ఓ భగ్న ప్రేమికుడని తెలిసింది. అప్పటి వరకు ప్రశాంతగా సాగిన పెళ్లి వేడుక గందరగోళంగా మారింది.


Also Read: Air hostess dance Viral Videos: స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ వైరల్ వీడియో


Also Read: Viral Video: వామ్మో..! ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ వంట గదిలోకి వెళ్లింది..కానీ చివరకు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook