Viral Video Man Steals Baby: ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తల్లి పక్కన నిద్రిస్తున్న ఓ పసి పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ప్లాట్‌ఫామ్‌పై అటు, ఇటు తచ్చాడుతూ కనిపించిన అతను అక్కడ నిద్రిస్తున్నవాళ్లను గమనించాడు. కాసేపటికి దగ్గరగా వెళ్లి.. తల్లి పక్కన నిద్రిస్తున్న పసిపాపను ఒకే చేత్తో పైకి లేపాడు. పాపను ఎత్తుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఈ దృశ్యాలు రైల్వే ప్లాట్‌ఫామ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మథుర రైల్వే జంక్షన్‌లోని 8-9 ప్లాట్‌ఫామ్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరారు. నిందితుడు హత్రాస్ లేదా అలీగఢ్‌కి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ఎత్తుకెళ్లిన పాప వయసు 7 నెలలు ఉంటుందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.



Also Read: Noida Supertech Twin Towers demolition LIVE Updates: చరిత్రలో కలిసిపోయిన నోయిడా ట్విన్ టవర్స్‌.. 9 సెకన్లలో 40 అంతస్తులు నేలమట్టం


Also Read: Optical Illusion: మీకొక ఛాలెంజ్.. ఈ చిత్రంలో దాగున్న పిల్లిని 15 సెకన్లలో గుర్తించగలరా..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook