చంద్రయాన్ 2 మిషన్‌పై స్పందించిన విరాట్ కోహ్లీ
చంద్రయాన్ 2 మిషన్‌పై స్పందించిన విరాట్ కోహ్లీ
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం ఆఖరి క్షణాల్లో అవరోధాల బారిన పడటంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ఆవేదనకి గురైన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ఇస్రో తప్పేమీ లేదని... ఇస్రో చేసిన ప్రయత్నమే గొప్పదని చెబుతూ యావత్ ప్రపంచం ఇస్రోకి బాసటగా నిలిచింది.
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. ''సైన్స్‌లో పరాజయం అనే మాటకు స్థానమే లేదని ట్వీట్ చేసిన కోహ్లీ.. చంద్రయాన్-2 ప్రయోగం కోసం రాత్రి, పగలు అవిశ్రాంతంగా శ్రమించిన శాస్త్రవేత్తల పట్ల గౌరవమే ఉంటుందని అన్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందంటూ కోహ్లీ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసల్లో ముంచెత్తారు.