న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు ముందడుగు పడింది. ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వర్చువల్ ఐడీ(వీఐడీ)ని యూఐడీఏఐ  ప్రవేశపెట్టింది. గుర్తింపు లేదా ధృవీకరణ సమయంలో ఇకపై ఆధార్ బదులుగా వీఐడీని వెల్లడిస్తే సరిపోతుంది. జూన్ 1, 2018 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. బీటా వర్షన్‌లో తెచ్చిన వీఐడీని ప్రస్తుతానికైతే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాలో మార్పులు చేర్పులు చేసుకొనేందుకు ఉపయోగించుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి వీఐడీని జనరేట్ చేసుకోవాలి. ఆధార్ 12 అంకెల సంఖ్య కాగా దీనిలో 16 అంకెలు ఉంటాయి. బ్యాంకింగ్, బీమా, మొబైల్ లాంటి సేవలు అందించే సమయంలో ఆయా సంస్థలకు ఆధార్ బదులుగా వీఐడీని చెప్తే సరిపోతుంది. జూన్ 1, 2018 నుంచి అన్ని సంస్థలు వీఐడీని తప్పనిసరిగా అంగీకరించాలి.


ఆధార్ చట్టం న్యాయబద్ధమే: కేంద్రం


ఆధార్ న్యాయమైన, హేతుబద్ధ చట్టమేనని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. గోప్యతా హక్కుపై కోర్టు ఇచ్చిన తీర్పుకు అది లోబడి ఉందని పేర్కొంది.