న్యూఢిల్లీ : వోడాఫోన్ లాంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లచే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించడాన్ని చాల కాలం తరవాత మనం చూడబోతున్నాం. వోడాఫోన్ తన చందాదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. చందాదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ .99 మరియు రూ .555 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. 


ఈ ప్రణాళికలు రిలయన్స్ జియో ప్రణాళికలను   పోలి ఉంటాయని వోడాఫోన్ తెలిపింది. వోడాఫోన్ అందించబోయే కొత్త ప్రణాళికలు ఇంతకుముందు అందించిన వాటికంటే సరసమైన ధరలను కలిగి ఉంటాయని తెలిపింది. చందాదారులు చేసుకునే ప్రీపెయిడ్ రీఛార్జ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మధ్య శ్రేణి ప్రణాళికలు వినియోగదారులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయని వోడాఫోన్ సంస్థ పేర్కొంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..