Vote Counting: సార్వత్రిక ఎన్నికలకు ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్‌లో కీలక మార్పు చేసింది. జారీ చేసిన ప్రకటనలో సవరణ చేసింది. అది పొరపాటో.. దిద్దుబాటో తెలియదు కానీ తేదీలను మాత్రం మార్చింది. ప్రకటన విడుదల చేసిన ఒకరోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్‌ విడుదల చేసిన అనంతరం ఇలా మార్పు చేయడం గమనార్హం. అయితే మార్చిందేమిటో కాదు 'ఓట్ల లెక్కింపు తేదీ'ని ఎన్నికల సంఘం మార్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR House: మాజీ సీఎం కేసీఆర్‌ ఇంటికి తాగునీటి ఇబ్బందులు.. నీరు రాకుండా రేవంత్‌ రెడ్డి కుట్రనా?


 


సార్వత్రిక ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం శనివారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాత్రం సవరణలు చేసింది. ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు లేదా ఫలితాల వెల్లడి తేదీని మార్చింది. తుది ఫలితాల వెల్లడి తేదీని మారుస్తూ ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మొదట విడుదల చేసిన ప్రకటనలో ఆ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్‌ 4వ తేదీన చేపట్టాలని ప్రకటించింది. ఇప్పుడు ఆ తేదీని మార్పు చేసి సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు అంటే జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: Jithender Reddy: తెలంగాణలో ఉండగానే మోదీకి షాక్‌.. కాంగ్రెస్‌లోకి బీజేపీ అగ్ర నాయకుడు


 


అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు, సిక్కింలో మొత్తం 32 స్థానాలకు మొదటి విడతలో భాగంగా ఏప్రిల్‌ 19వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మార్పుకు కారణమేమిటంటే.. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ గడువు జూన్‌ 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తేదీని వెనక్కి జరిపింది. సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక మిగతా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter