ఎవరైనా కావాలని చావుని కొని తెచ్చుకోవాలని అనుకుంటారా ? ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ట్రాక్టర్‌తో దాటించాలని ప్రయత్నిస్తారా ? అది కూడా నిండా ఇసుకతో లోడ్ చేసి ఉన్న ట్రాక్టర్‌ని నదిలోకి తీసుకెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే! కానీ ఇదిగో ఈ సీన్‌లో కనిపిస్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం అలాంటి దుస్సాహసమే చేశాడు. ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌తో నదిలోకి వెళ్లి, అవతలి ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించాడు. కానీ నది అలల తాకిడికి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు బతుకుజీవుడా అని.. బోల్తా పడిన ట్రాక్టర్‌లోంచి నదిలోకి ప్రాణాలు దక్కించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


హిమాచల్ ప్రదేశ్‌లోని చంబ వద్ద పొంగి ప్రవహిస్తున్న రావి నది ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. అయినా అక్కడి ఇసుక మాఫియా మాత్రం ఇసుక అక్రమ రవాణా ఆపడం లేదు. ఇదిగో.. ఇలా ప్రాణాలకు తెగించి మరీ ఇసుక రవాణా చేస్తోన్న వైనం ఇలా బట్టబయలైంది.